క్రేజీ కాంబినేషన్ లో మరో క్రేజీ నటుడు

క్రేజీ కాంబినేషన్ లో మరో క్రేజీ నటుడు

Published on May 27, 2024 12:00 AM IST

‘ద‌స‌రా’ కాంబో నాని – శ్రీ‌కాంత్ ఓదెల కలయికలో ఓ సినిమా రాబోతుంది. నాని కోసం శ్రీకాంత్ ఓ స‌రికొత్త కథ రాశాడట. ఐతే, ఈ సినిమా గురించి తాజాగా ఓ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని.. ఈ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, నాని ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్ ను ఇస్తోంది. ఎందుకంటే నాని – విజయ్ సేతుపతి కాంబినేషన్ నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది.

పైగా విజయ్ సేతుపతిది కీలక పాత్ర అని.. అలాగే సినిమాలో మెయిన్ విలన్ అతనే అని, ఇక విజయ్ సేతుపతి లుక్‌, మేకొవ‌ర్ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేస్తాయని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా ఈ కథా నేపథ్యం 80వ దశకంలో సాగుతుందట. నిజ‌మైన నాయ‌కుడికి ఐడెంటిటీ అవ‌స‌రం లేద‌న్న స్లోగ‌న్ ను ఈ సినిమా పోస్ట‌ర్‌పై పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు