నాని – సుజీత్ మూవీ పై మరో కొత్త పుకారు!

నాని – సుజీత్ మూవీ పై మరో కొత్త పుకారు!

Published on May 18, 2024 3:00 AM IST

నాచురల్ స్టార్ నాని గతేడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ హీరో తదుపరి వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం చిత్రం లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తరువాత నాని చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుజీత్ తో. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వీడియో తోనే అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రకటన తోనే పాజిటివ్ వైబ్స్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ చిత్రం పై పలు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే బడ్జెట్ కారణాల వలన సినిమా ఆగిపోయింది అని కొందరు చెబుతుండగా, ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ను నిర్మించేందుకు సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ ముందుకి వచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతం గా వైరల్ అవుతోంది. అయితే వీటిపై క్లారిటీ రావాలంటే, మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు