
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘లింగ’ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఓ మంచి స్క్రిప్ట్ తో రావాలని బాగా గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ అయిన పిఎ రంజిత్ డైరెక్షన్ లో ఓ రియల్ లైఫ్ స్టొరీ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర టీం రజినీకాంత్ పై తన లుక్ కి సంబందించిన ఫోటో షూట్ చేస్తున్నారని తెలియజేశాం. ఈ చిత్ర టీం సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం రజినీకాంత్ లుక్ అందరినీ థ్రిల్ చేస్తుందని అంటున్నారు.
వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ‘రజినీకాంత్ గత వారం తన లుక్ కోసం జరిపిన ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో రజిని స్టైలిష్ హెయిర్ స్టైల్ మరియు వైట్ గడ్డం లుక్(సాల్ట్ అండ్ పెప్పర్ లుక్) లో కనిపిస్తాడు. అది రజినీ ఫ్యాన్స్ ని థ్రిల్ చేసేలా ఉంటుందని’ తెలిపారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 18 నుంచి మొదలు కానుంది. అదే రోజు ఈ ఫోటో షూట్ నుంచి ఫైనలైజ్ అయిన స్టిల్స్ ని ఫస్ట్ లుక్ పోస్టర్స్ గా రిలీజ్ చేయనున్నారు. సౌత్ చెన్నైలోని ఓ రియల్ లైఫ్ మాఫియా డాన్ పాత్రని స్పూర్తిగా తీసుకున్న ఈ సినిమాలో రజినీకాంత్ కబాలీశ్వరస్ అనే పాత్రలో కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాకి తమిళ్లో ‘కబాలి’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.