‘దేవర సీక్వెల్’ కచ్చితంగా ఉంటుందని ఇప్పటికే ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. మరి ‘దేవర పార్ట్-2’ షూట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందో ఇంకా క్లారిటీ లేదు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా ఎన్టీఆర్ లేని సీన్స్ ను షూట్ చేయాలని కసరత్తులు చేస్తున్నారట. అన్నట్టు, దేవర సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ రెడీ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అన్నట్టు కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.


