పిక్ టాక్ : కయాదుతో కలిసి మంటపెట్టేస్తున్న నాని.. ది ప్యారడైజ్ నయా పోస్టర్ అదిరింది..!

పిక్ టాక్ : కయాదుతో కలిసి మంటపెట్టేస్తున్న నాని.. ది ప్యారడైజ్ నయా పోస్టర్ అదిరింది..!

Published on Sep 16, 2026 5:58 PM IST

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో కౌంట్ డౌన్ పోస్టర్స్‌తో దుమ్ములేపుతున్నారు.

తాజాగా విడుదలైన ఈ మూవీ పోస్టర్‌లో నాని రగ్గడ్ అండ్ రా లుక్‌లో కనిపిస్తుండగా, హీరోయిన్‌తో కలసి లైటర్ వెలిగిస్తున్న ఇంటెన్స్ సీన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు కేవలం 8 రోజులు మాత్రమే సమయం ఉందంటూ మేకర్స్ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. పాన్-ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డులను క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు