కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పైగా కొరటాల శివ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ఘాట్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ‘దేవర సీక్వెల్’ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సీక్వెల్ ఉందా ?, పూర్తిగా ఆగిపోయిందా ? అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఐతే, ‘దేవర సీక్వెల్’ కచ్చితంగా ఉంటుందని ఆ మధ్య ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పడు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా వచ్చే ఏడాది ఎండ్ లో స్టార్ట్ అవుతుందని టాక్.
కొరటాల శివ, బాలయ్యతో చేసే ప్రాజెక్ట్ అయిపోయాక, ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో చేసే సినిమా ఘాట్ పూర్తి అయ్యాక.. దేవర సీక్వెల్ ను మొదలుపెడతారట. అన్నట్టు ‘దేవర సీక్వెల్’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ రెడీ పూర్తి అయ్యాయి. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.


