నైజాంలో జనవరి 1 నుంచి ‘అఖండ 2’ కొత్త టికెట్ ధరలు..!

నైజాంలో జనవరి 1 నుంచి ‘అఖండ 2’ కొత్త టికెట్ ధరలు..!

Published on Dec 30, 2025 12:18 PM IST

అఖండ 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ డివోషనల్ చిత్రమే “అఖండ 2 తాండవం”. బాలయ్య బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఈ సినిమా నెగిటివ్ టాక్ ని ఆన్లైన్ లో తెచ్చుకున్నప్పటికీ ఆఫ్ లైన్ లో మాత్రం బాగానే వెళ్ళింది.

టికెట్ సేల్స్ ట్రెండింగ్ లో ఈ సినిమా ఊహించని పెర్ఫామెన్స్ చేయగా లేటెస్ట్ గా మేకర్స్ ఈ సినిమా టికెట్ ధరలు విషయంలో కొత్త సంవత్సరం నుంచి కొత్త డెసిషన్ తీసుకున్నారు. రానున్న జనవరి 1 నుంచి నైజాంలో అఖండ 2 థియేటర్స్ లో కేవలం 105 రూపాయలు గరిష్టంగా సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు మల్టిప్లెక్స్ స్క్రీన్స్ లో గరిష్ట ధరలతో ప్రదర్శితం కానున్నట్టు మేకర్స్ తెలిపారు. సో ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు