‘తేజ్ ఐ లవ్ యు’ టైటిల్ ఖరారు అయ్యిందా ?

‘తేజ్ ఐ లవ్ యు’ టైటిల్ ఖరారు అయ్యిందా ?

Published on Apr 6, 2018 4:30 PM IST

కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమాకు ‘అందమైన చందమామ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ సినిమాకు ‘తేజ్ ఐలవ్ యు’ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ఫైనల్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కె.ఎస్.రామారావ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రముఖ రచయిత డార్లింగ్ స్వామి ఈ సినిమాకు మాటలు రాస్తుండగా అంద్రు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సారధి స్టూడియోలో జరుగుతోంది. దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు