తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు, యంగ్ టాలెంటెడ్ హీరో ధృవ్ విక్రమ్ కొత్త మూవీని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కరణ్ ఎ. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాకి ‘జాకీ’ అనే టైటిల్‌ను తాజాగా ఖరారు చేశారు మేకర్స్.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ను సెప్టెంబర్ 18న సాయంత్రం 4:05 గంటలకు రివీల్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.
ధృవ్ విక్రమ్ మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అలాగే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి రేపు రాబోయే అప్డేట్తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
