తమిళ హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్.మిత్రన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. జూలై 31న ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా నుంచి వచ్చే ఈ స్పెషల్ ట్రీట్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను 2026 సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ సీక్వెల్‌లో ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటిస్తుండగా.. మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఖైదీ’ ఫేమ్ సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.


