‘మీర్జాపూర్’ సీజన్ 3 పై లేటెస్ట్ అప్ డేట్

‘మీర్జాపూర్’ సీజన్ 3 పై లేటెస్ట్ అప్ డేట్

Published on May 29, 2024 12:08 PM IST


మీర్జాపూర్ వెబ్ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇతర భాషల్లో కూడా పెద్ద విజయాన్ని సాధించింది. మొత్తానికి ఫస్ట్ సీజన్ కి వచ్చిన చాలా హైప్ తర్వాత, రెండో సీజన్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. పైగా మీర్జాపూర్ ఫస్ట్ సీజన్ అత్యధిక వ్యూస్ దక్కించుకుని ఇండియన్ సిరీస్‍గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఐతే, తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో మీర్జాపూర్ మూడో సీజన్ గురించి క్రేజీ అప్డేట్ తెలిపింది. మీర్జాపూర్ సీజన్ 3 కోసం మరికొన్ని రోజులు ఆగండి అంటూ ఓ పోస్టర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. మొత్తానికి ఈ సీజన్ 3 ఈ ఏడాది జూన్ లేదా జులై లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు