లవ్ సీన్స్ లో ‘బ్యాచ్‌ల‌ర్’ హైలైట్ అట !

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమాలో లవ్ సీన్స్ చాల బాగా వచ్చాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీని నాగార్జున చూశారని, సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడని తెలుస్తోంది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందట.

కాగా అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి అఖిల్ కి ఎలాంటి హిట్ వస్తోందో చూడాలి.

Exit mobile version