‘సీటీమార్‌’లో యాక్షన్ హైలైట్ అట !

‘సీటీమార్‌’లో యాక్షన్ హైలైట్ అట !

Published on Feb 13, 2020 2:31 AM IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా ‘సీటీమార్‌’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గోపీచంద్ లుక్, తమన్నా లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో తమన్నా జ్వాలా రెడ్డి అనే కబడ్డీ కోచ్ గా చేస్తున్నారు. ఆమ్ రోల్ కూడా ఈ చిత్రంలో సీరియస్ నెస్ తో కూడుకున్న ఇంటెన్సిటీతో ఉంటుందట.

గోపీచంద్ ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తున్నాడు. అయితే తమన్నా – గోపీచంద్ మధ్య గేమ్ కి సంబంధించి మంచి వార్ ఉంటుందట. కాగా రీసెంట్ గా మొదలైన షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు