‘హరిహర వీరమల్లు’ మొదలు అప్పటినుంచే

‘హరిహర వీరమల్లు’ మొదలు అప్పటినుంచే

Published on May 20, 2024 12:03 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకి జూన్ నాలుగో వారం నుంచి పవన్ డేట్స్ కేటాయించాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి అయితే, ఆగస్టు రెండో వారం నుంచి పవన్ డేట్స్ ఇచ్చాడని తాజాగా టాక్ నడుస్తోంది. ఐతే, ఏపీలో ఎన్నికల ఫలితాలను బట్టి ఈ సినిమా షెడ్యూల్స్ మారే అవకాశం ఉంది.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు