‘కన్నప్ప’ కొత్త షెడ్యూల్ అక్కడే

‘కన్నప్ప’ కొత్త షెడ్యూల్ అక్కడే

Published on May 25, 2024 10:00 PM IST

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. అయితే తాజా అప్ డేట్ ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ తిరుపతి లో ప్రారంభం కానుంది. సినిమాలోని కీలక తారాగణం మొత్తం ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతారట. ఈ షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇక కథ ప్రకారం ఈ షెడ్యూల్ చాలా కీలకం అని, ఈ షెడ్యూల్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మంచు విష్ణు పాత్ర పై ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే, కన్నప్ప లో ప్రభాస్, అక్షయ్ కుమార్ మరియు మోహన్ లాల్ కూడా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు