‘రాజమౌళి – మహేష్’ సినిమా పై కొత్త అప్ డేట్

‘రాజమౌళి – మహేష్’ సినిమా పై కొత్త అప్ డేట్

Published on Mar 4, 2024 10:12 PM IST

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. నిజానికి మొన్నటివరకూ తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి.

మరి ఈ రెండు తేదీల్లో ఏ తేదీన ఈ సినిమా స్టార్ట్ అవుతుందో ఓ అప్ డేట్ వినిపిస్తోంది. మహేష్ పుట్టినరోజు తేదీ అయిన ఆగస్టు 9నే ఈ సినిమా అధికారికంగా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు