‘కొరటాల – మెగాస్టార్’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

‘కొరటాల – మెగాస్టార్’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Nov 20, 2019 2:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది. కాగా డిసెంబ‌ర్‌ లో సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ ఉండనుంది.

ఇక అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషనే హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారని.. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు