చైతులోని డ్యాన్స్ స్కిల్స్ ను ఫుల్ గా వాడేశారట !

చైతులోని డ్యాన్స్ స్కిల్స్ ను ఫుల్ గా వాడేశారట !

Published on Mar 13, 2020 12:13 AM IST

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. తెలంగాణ నేపథ్యంలో నడిచే రియలిస్టిక్ లవ్ స్టోరీలా ఈ సినిమా ఉండనుంది. కథలో రియాలిటీ కోసం కొంతభాగం గ్రామీణ ప్రాంతాల్లో షూట్ చేశారు. అయితే ఈ సినిమాలో డ్యాన్స్ మీద ప్రధానాంశంగా సాగే ఓ సాంగ్ లో చైతు చేత ఫుల్ డాన్స్ చేయించారట. చైతూ గత చిత్రాల్లో వేయని రేంజ్ స్టెప్స్ ను ఈ సారి ఈ సినిమాలో వేశారని.. చైతులోని డ్యాన్స్ స్కిల్స్ ను పూర్తిస్థాయిలో శేఖర్ కమ్ముల వాడుకున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా నుండి నిన్న రిలీజ్ అయిన ‘‘ఏయ్ పిల్లా’’ లిరికల్ వీడియో సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. హీరో పాయింటాఫ్ వ్యూలో సాగే ఈ సాంగ్.. హీరోయిన్ గురించి హీరో ఫీల్ అవుతున్న ఎమోషన్స్ ను అండ్ ఫీలింగ్స్ ను బాగా ఎలివేట్ చేసింది. ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. కాగా నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అక్కినేని అభిమనుల్లో, అలాగే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై బాగానే అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు