ప్రియా ప్రకాష్ కి అవకాశాలు వస్తున్నాయట !

ప్రియా ప్రకాష్ కి అవకాశాలు వస్తున్నాయట !

Published on Jan 25, 2020 8:11 AM IST

సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ తో పాటు స్టార్ డమ్ ని సంపాదించింది యంగ్ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ స్టార్ డమ్ కి తగ్గట్లుగానే మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చినా.. అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. ఆ దెబ్బకి వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఆ తరువాత ప్రియా హీరోయిన్ గా నటించిన ‘ఓరు అదార్ లవ్’ సినిమా ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులోకి డబ్ అయి అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రియా ప్రకాష్ ఆశలకు బ్రేకులు పడ్డాయి. అప్పటికీ ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడింది. ప్రస్తుత పరిస్థితికి వస్తే.. మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటా ముందు మీ చిత్రంలో ఒక అవకాశం ఇవ్వండని అందర్నీ అడుగుతుందట.

ప్రధానంగా ఆమె టాలీవూడ్ నే టార్గెట్ చేసుకుంది. ఈ క్రమంలోనే హీరో నితిన్ కొత్త చిత్రంలో ప్రియా సెకెండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అని తెలుస్తుంది. అలాగే మరో సినిమాలో కూడా నటించబోతుందట. నాగశౌర్య హీరోగా రాబోయే ఓ చిత్రంలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మరి ఈ రెండు సినిమాల్లో తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు ప్రియాకి బాగానే వస్తాయి. అయితే ప్రియా ప్రకాష్ కి ఎక్కువుగా సెకెండ్ హీరోయిన్ అవకాశాలే వస్తున్నాయి. అందుకే అవకాశం వచ్చినప్పుడే అందుకోవాలనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు