‘సలార్ -2’ స్క్రిప్ట్ పై కసరత్తులు

‘సలార్ -2’ స్క్రిప్ట్ పై కసరత్తులు

Published on Feb 12, 2024 6:03 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. దీంతో, సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సలార్-2 పై ఓ రూమర్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లేట్ అవుతుందని.. ఈ లోపు ‘సలార్ 2’ షూటింగ్ ను స్టార్ట్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. జూన్ నుంచి ‘సలార్ 2’ షూట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆ మధ్య సలార్ 2 సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘సమ్మర్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2ని స్టార్ట్ చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు. అన్నట్టు సలార్ పార్ట్ 1 మూవీ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు