‘ఆదర్శకుటుంబం’లో మరో గెస్ట్ రోల్ ?

‘ఆదర్శకుటుంబం’లో మరో గెస్ట్ రోల్ ?

Published on May 24, 2026 9:07 AM IST

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఆదర్శకుటుంబం చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ఓ సీనియర్ హీరోయిన్ గెస్ట్ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఈ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ కామెడీ సీక్వెన్సెస్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

ఇక నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అన్నట్టు త్రివిక్రమ్‌, వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు రచయితగా పని చేశారు. ఈ కాంబినేషన్‌లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

తాజా వార్తలు