‘కంచె’తో టాలీవుడ్‌కి మరో కొత్త విలన్

Kanchae
తెలుగు సినిమాల్లో విలన్ పాత్రకు ఉండే ఇంపార్టెన్స్ అలాంటిలాంటిది కాదు. హీరోయిజంను బిల్డప్ చేయడానికి సాధారణంగానే స్ట్రాంగ్ విలన్స్‌తో భారీ సన్నివేశాలు ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమాలో విలన్స్‌గా నటించేందుకు బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఇతర భాషల నుంచి కూడా నటులను ఇక్కడ పరిచయం చేస్తుంటారు. ఇక తాజాగా ‘కంచె’ సినిమాతో మరో బాలీవుడ్ విలన్ తెలుగు సినిమాకు పరిచయం కానున్నారు. విలక్షణ దర్శకుడు క్రిష్ స్టన్నింగ్ విజువల్స్‌తో రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్‌కి అపోజిట్‌గా బాలీవుడ్ విలన్ నికేతన్ ధీర్ నటించారు. గతంలో జోధా అక్బర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో విలన్‌గా నటించిన నికేతన్, కంచెతో తెలుగు సినిమాకు పరిచయమవుతున్నారు. ఇక ఈ ఉదయం విడుదల చేసిన ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందనే విషయం మరోసారి స్పష్టం కాగా, నికేతన్ పర్ఫామెన్స్ కూడా సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందనే అభిప్రాయం కూడా వినబడుతోంది. వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై అంతటా విపరీతమైన అంచనాలున్నాయి.

Exit mobile version