‘న్యూటన్స్ థర్డ్ లా’ అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.105 కే మూవీ టికెట్..!

‘న్యూటన్స్ థర్డ్ లా’ అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.105 కే మూవీ టికెట్..!

Published on Jul 28, 2026 11:01 PM IST

టాలెంటెడ్ యాక్టర్ సుమంత్, వెర్సటైల్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton’s 3rd Law) ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూలై 31న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు గ్రాండ్ ఆఫర్ ప్రకటించింది. తెలంగాణలోని సంధ్య థియేటర్, పీవీఆర్, ఐనాక్స్ వంటి మెయిన్ థియేటర్లలో ఈ సినిమాను కేవలం రూ.105 కే వీక్షించే వెసులుబాటు కల్పించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయని.. ప్రేక్షకులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని చిత్ర యూనిట్ కోరింది.

రాజేష్ కర్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు