స్టార్ హీరో పొలిటికల్ థ్రిల్లర్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Feb 13, 2019 4:42 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్.జీ.కే’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 14న విడుదల చేస్తోన్నారు. ప్రస్తుతం ఈ టీజర్ కోసం నెటిజన్లు ఏంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టీజర్ కి సంబధించి ఓ వార్త తెలిసింది.

టీజర్ రన్ టైం ను చిత్రబృందం ఫిక్స్ చేసిందట. 1 నిమిషం 6 సెకండ్ల నిడివితో టీజర్ ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా పై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :