పెద్ద మల్టీస్టారర్ పైనే కన్నేసిన నిధి.. ఏ హీరోలు, దర్శకుడు కావాలో చెప్పి షాక్

Nidhhi Agerwal

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కూడా ఒకరు. మరి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన హరిహర వీరమల్లు ఈ ఏడాదిలో వచ్చింది కానీ డిజప్పాయింట్ చేసింది. ఇక దీని తర్వాత ఇదే ఏడాదిలో రావాల్సిన రాజా సాబ్ మాత్రం జనవరికి మారింది. అయితే నిధి అగర్వాల్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ చాట్ సెషన్ పెట్టగా తన డ్రీం మల్టీస్టారర్ కాంబినేషన్ కోసం చెబుతుంది.

Pawan Prabhas Multi Starrer – పవన్, ప్రభాస్ నేను.. (నిధి అగర్వాల్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ లతో కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ చేయాలని ఉన్నట్టుగా ఆమె చెబుతుంది. వీరమల్లు, రాజా సాబ్ సినిమాలతో ఆమె తన హీరోల యాటిట్యూడ్ కి ఫిదా అయినట్టు పలుమార్లు చెప్పింది. మరి బహుశా ఆ కారణం చేతనే ఈ సెన్సేషనల్ కలయిక కావాలి అది కూడా హీరోయిన్ నేనే అంటూ చెప్పింది.

దర్శకునిగా కూడా షాకింగ్ పేరు

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రభాస్ (Prabhas) లు అనేదే ఒక బిగ్గెస్ట్ కాంబినేషన్ అంటే ఈ కలయికని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరకెక్కించాలి అని అంటుంది. ఇలాంటి మ్యాడ్ కాంబినేషన్ లో తాను హీరోయిన్ గా చేయాలని తన డ్రీం మల్టీస్టారర్ కాంబినేషన్ అంటూ సెలవిచ్చింది.

ఇలాంటివి ఊహల్లో బాగానే ఉంటాయి కానీ రియాలిటీలో సెట్ అయితే మాత్రం వాటి ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నిధి చెప్పిన ఈ ఊహించని కాంబినేషన్ కి ఫ్యాన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది.

Exit mobile version