నిధి అగర్వాల్ పెద్ద సినిమాకే సైన్ చేసిందట ?

నిధి అగర్వాల్ పెద్ద సినిమాకే సైన్ చేసిందట ?

Published on Oct 18, 2019 4:05 PM IST

మొదటి రెండు సినిమాలు ‘సవ్యసాచి, మిస్టర్ మజ్ను’ నిధి అగర్వాల్ ను నిరాశపరిచినా ఆ తర్వాత చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం అనుకున్నదానికంటే ఎక్కువ ఫలితాన్నే ఇచ్చింది. దీంతో నిధి మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది. ఆమెకు అభిమానులు కూడా పెరిగారు. ఈ సినిమాతో పక్కా కమర్షియల్ ఎంటెర్టైనర్లకు సరిగ్గా సరిపోతుందనే పేరు కూడా తెచ్చుకుంది. ఇంత పెద్ద హిట్ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాలి.

కానీ అధికారికంగా తెలుగులో ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు నిధి. కానీ సినీ వర్గాల సమాచారం మేరకు ఆమెకు ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చిందని, ఆ ప్రాజెక్ట్ ఇంకా అనౌన్స్ కాలేదు కాబట్టి నిధి బయటకు చెప్పట్లేదని, ఒకవేళ ఆ చిత్రానికి సంబంధిచిన నిర్మాతలు సినిమాను ప్రకటిస్తే వెంటనే రివీల్ చేస్తుందని తెలుస్తోంది. మరి ఆ పెద్ద ప్రాజెక్ట్ ఏమిటి, హీరో ఎవరు, దర్శకత్వం ఎవరు చేస్తారు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు