ప్రభాస్ పెద్దమ్మకు నిధి అగర్వాల్ థ్యాంక్స్.. ఎందుకో తెలుసా..?

Nidhhi-Agerwal

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హార్రర్ కామెడీగా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, తాజాగా నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేసి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవికి ధన్యవాదాలు తెలిపింది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ప్రభాస్ తన తోటి నటీనటులకు ఎప్పుడూ భోజనం పంపించడం మనకు తెలిసిందే. అయితే, తాజాగా నిధి అగర్వాల్‌కు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి భోజనం పంపించారు. దీంతో అవాక్కయిన నిధి అగర్వాల్, ఇంతటి చక్కటి భోజనం పంపిన శ్యామలా గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. ఆమెతో పాటు ప్రభాస్, వంశీ లకు కూడా నిధి థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.

Exit mobile version