ఇస్మార్ట్ శంకర్ తో అపవాదు పోగుట్టుకున్న నిధి.

ఇస్మార్ట్ శంకర్ తో అపవాదు పోగుట్టుకున్న నిధి.

Published on Jul 27, 2019 9:23 AM IST

“ఇస్మార్ట్ శంకర్” ఘనవిజయం చాలా మంది కెరీర్ ని గాడిలో పెట్టింది. దర్శకుడిగా పూరి, హీరోగా రామ్, నిర్మాతగా చార్మి “ఇస్మార్ శంకర్” తో అరుదైన విజయాన్ని అందుకున్నారు. వీరందరిని హిట్ మెట్టు ఎక్కేలా చేసింది ఈ చిత్రం. వీరందరికంటే కూడా “ఇస్మార్ట్ శంకర్” విజయాన్ని ఆస్వాదిస్తున్న వారిలో హీరోయిన్ నిధి అగర్వాల్ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఈ చిత్ర విజయం ఆమె కెరీర్ కి అంత ముఖ్యం.

టైగర్ ష్రాఫ్ నటించిన “మున్నా మైఖేల్” సినిమాతో నటిగా పరిచయమైన నిధి “ఇస్మార్ట్ శంకర్” ముందు వరకు విజయం రుచి చూడలేదు. “మున్నా మైఖేల్” బాలీవుడ్ లో పరాజయం చెందింది. ఆ తరువాత ఈ భామ నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన “సవ్యసాచి” చిత్రంలో నటించగా ఆ చిత్రం కూడా పరాజయం పాలైంది. ఇక మరో అక్కినేని వారసుడు అఖిల్ తో చేసిన “మిస్టర్ మజ్ను” కూడా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఈమె హ్యాట్రిక్ పరాజయాలను పొందింది.
సెంటిమెంట్ లు అధికంగా ఫాలో అయ్యే చిత్ర పరిశ్రమలో ఒక్కసారి ప్లాప్ హీరోయిన్ గా పేరుపడితే అవకాశాలు రావడం చాలా కష్టం. “ఇస్మార్ట్ శంకర్” హిట్ నిధి ని ఆ ప్రమాదం నుండి బయటపడేసిందనే చెప్పాలి. “ఇస్మార్ట్ శంకర్” మూవీ తరువాత నిధి అగర్వాల్ కి తెలుగు మరియు తమిళంలో రెండు చిత్రాలలో నటించే అవకాశం దక్కిందని సమాచారం. వీటితో పాటు మాస్క్,ఇక్కా అనే రెండు హిందీ చిత్రాలలో కూడా నిధి అగర్వాల్ నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు