నైట్ ఎఫెక్ట్ లో సాంగ్ షూట్ చేసిన ‘కరెంట్ తీగ’ టీం

నైట్ ఎఫెక్ట్ లో సాంగ్ షూట్ చేసిన ‘కరెంట్ తీగ’ టీం

Published on Sep 18, 2014 8:00 AM IST

currentthiga1
యంగ్ అండ్ ఎనర్జిటిక్ మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కరెంట్ తీగ’. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని ఇది వరకే తెలియజేశాం. ప్రస్తుతం ఈ సినిమాలో మిగిలి ఉన్న పాటలని షూట్ చేస్తున్నారు. అది కూడా నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేస్తున్నారు. నిన్న రాత్రి జరిగిన సాంగ్ షూటింగ్ లో మంచు మనోజ్, వెన్నెల కిషోర్ లతో పాటు ప్రధాన నటీనటులు కూడా పాల్గొన్నారు.

ఇటీవలే విడుదలైన కరెంట్ తీగ ఆడియో ఆల్బమ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కరెంట్ తీగ సినిమా తమిళంలో విజయం సాధించిన ‘వర్తపడు వాలిబర్ సంఘం’ సినిమాకి రీమేక్. కానీ తమిళ ఒరిజినల్ కథని తీసుకొని మనోజ్ ఇమేజ్ కి తగ్గట్టు కథలో చాలా మార్పులు చేసారు.

మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జి. నాగేశ్వరరెడ్డి డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంటే, శిల్పి శర్మ ఓ ఐటెం సాంగ్ లో కనిపిచనుంది. అచ్చు మ్యూజిక్ అందించిన ఈ సినిమాని మంచు విష్ణు నిర్మించాడు. సెప్టెంబర్ 2న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు