నిహాల్ కోదాటి స్పై థ్రిల్లర్ ‘సీక్రెట్ సోల్జర్’ నుంచి ఓయ్ ఓయ్ సాంగ్ రిలీజ్

యువ నటులు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామానే ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్ల నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇక తాజాగా మేకర్స్ ఓయ్ ఓయ్ సాంగ్ రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ని క్యాచి గా ట్యూన్ గా కంపోజ్ స్వయంగా అలపించిన తీరు ఆకట్టుకుంది. రెహమాన్ అందించిన సాహిత్యం పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అదే సమయంలో క్యారెక్టర్స్‌పై ఆసక్తిని పెంచేలా పాటను తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version