నిఖిల్ సరసన అనూ ఇమాన్యుల్ అట ?

నిఖిల్ సరసన అనూ ఇమాన్యుల్ అట ?

Published on Mar 25, 2020 10:00 AM IST

యంగ్ హీరో నిఖిల్ ‘అర్జున్ సురవరం’తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నాడు. కాగా ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్ లోనే మరో క్రేజ్ సినిమాతో రాబోతున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతుంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చించినట్లు తెలుస్తోంది. సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రోల్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి మిగిలిన పూర్తి వివరాలు రేపు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు