యువ హీరో నిఖిల్ నటిస్తున్న ‘ముద్ర’ చిత్రాన్ని నవంబర్ 8న విడుదల చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు అనుకున్న సమయానికి ఈచిత్రం విడుదలకాకపోవచ్చని సమాచారం. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం ఒక కారణమైతే దీపావళి ని టార్గెట్ చేస్తూ రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాకపోయినా వీటి ప్రభావం ఈ చిత్రం ఫై పడుతుందని ఆలోచిస్తున్నారట.
ఇక ఈ రెండు చిత్రాల్లో మొదటగా విజయ్ నటించిన ‘సర్కార్’ నవంబర్ 6న తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలవుతుంది. ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రానికి సరిగ్గా రెండు రోజుల తరువాత నవంబర్ 8న అమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ కూడా తెలుగు భాషలో విడుదలవుతుంది. అందుకే ఈ రెండు పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేయకుండా ముద్ర ను వాయిదావేసి సరైన సమయంలో థియేటర్లలోకి తీసుకురావలని బావిస్తున్నారట చిత్ర నిర్మాత ఠాగూర్ మధు.
