‘అర్జున్ సురవరం’ నిఖిల్ కి హిట్ ఇస్తాడా ?

‘అర్జున్ సురవరం’ నిఖిల్ కి హిట్ ఇస్తాడా ?

Published on Nov 16, 2019 1:00 AM IST

యంగ్ హీరో నిఖిల్ నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చిత్రీకరణతో పాటు అన్ని పనులు పూర్తై కొన్ని నెలలు గడిచినా విడుదలకు నోచుకోలేదు. మే, జూన్ అంటూ వాయిదాపడుతూ.. చివరికి ఈ నెల 29న విడుదలకు సిద్దమైంది. విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే గడువు ఉంది. అయినా చిత్ర టీమ్ ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఇంతకీ నిఖిల్ మాత్రం ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి హిట్ అందుకుంటాడేమో చూడాలి.

ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటించింది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. ప్రస్తుతం నిఖిల్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమాను చేస్తున్నాడు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు