“స్వయంభూ” గా వస్తున్న నిఖిల్!

Swayambhu

ముందుగా ప్రకటించినట్లు గా, నిఖిల్ 20 మేకర్స్ ఈ రోజు నటుడి పుట్టినరోజు సందర్భంగా చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి స్వయంభూ అని పేరు పెట్టారు. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకి దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. భువన్ మరియు శ్రీకర్, పిక్సెల్ స్టూడియోస్ క్రింద స్వయంభూని బ్యాంక్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది, ఇందులో నిఖిల్ యుద్ధభూమిలో క్రూరమైన యోధునిగా కనిపిస్తున్నాడు.

సాధారణ పోరాట యోధుడిలా పొడవాటి జుట్టుతో, నిఖిల్ ఒక చేతిలో బల్లెం పట్టుకుని మరో చేతిలో షీల్డ్ పట్టుకుని కనిపిస్తాడు. అతని మేకోవర్, గెటప్ ఆకట్టుకున్నాయి. ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీను క్రియేట్ చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. స్వయంభూ నిఖిల్ కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రంగా రూపొందుతుందని మేకర్స్ తెలిపారు. రవి బస్రూర్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు. మనోజ్ పరమహంస ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

Exit mobile version