యంగ్ హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఇదిలావుంటే ఈ సినిమా తరువాత నిఖిల్ ఇటీవల ‘శ్వాస’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. నూతన దర్శకుడు కిషన్ కట్ట ఈ చిత్రానికి దర్శకుడు. విజయ దశమి నాడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా ను లాంచ్ చేశారు. నివేత థామస్ ను కథానాయికగా తీసుకున్నారు.
తేజ్ ఉప్పలపాటి , హారిణికేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. ఈసినిమా టైటిల్ పోస్టర్ ను కూడా విడుదలచేశారు. అయితే ఈ చిత్రం ఇప్పుడూ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే దానికి గల కారణాలు తెలియాల్సి వుంది. మరి ఈసినిమా గురించి నిఖిల్ క్లారిటీ ఇస్తాడో చూడాలి.
