నిఖిల్ సెకండ్ హ్యాట్రిక్ ఖాతా తెరుస్తాడా?

నిఖిల్ సెకండ్ హ్యాట్రిక్ ఖాతా తెరుస్తాడా?

Published on Dec 3, 2015 8:00 PM IST

Nikhil
అందరూ వెళ్ళే దారిలో వెళితే తనకు గుర్తింపు రాదనీ తెలుసుకున్న యంగ్ హీరో నిఖిల్ తనకంటూ ఓ ప్రత్యేకతని ఎరపరుచుకోవడం సినిమా సినిమాకి ఓ వైధ్యమైన కథతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కేవలం అటెంప్ట్ మాత్రమే కాకుండా హిట్స్ కూడా అందుకున్నాడు. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య vs సూర్య’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నిఖిల్ నుంచి వస్తున్నా లేటెస్ట్ మూవీ ‘శంకరాభరణం’. ఈ సినిమా రేపు వర్ల్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా విజయంపై నిఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నిఖిల్ శంకరాభరణం సినిమాతో తన మరో సెకండ్ హ్యాట్రిక్ హిట్ లిస్టు ఖాతా తెరుస్తాడా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ మరియు ఇండస్ట్రీలో ఈ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ ఉండడం వలన శంకరాభరణం ఆడియన్స్ ని మెప్పిస్తుందనే అంటున్నారు. ఈ సినిమాకి కథ – కథనం – డైలాగ్స్ – నిర్మాత – దర్శకత్వ బాధ్యతలు కోన్ వెంకట్ చూసుకున్నారు. నందిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఉదయ నందనవనం డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు