‘కార్తికేయ – 2 ‘ కోసం నిఖిల్.. !

‘కార్తికేయ – 2 ‘ కోసం నిఖిల్.. !

Published on Aug 13, 2019 5:21 PM IST

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే మొదలెట్టనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది అయిన ‘పళని’ పుణ్య క్షేత్రానికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పుర్తయింది. స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. అయితే ప్రస్తుతం చిత్రబృందం హీరోయిన్ కోసం వెతుకుంది. అలాగే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు