యంగ్ హీరో నిఖిల్ పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటిలో ఒకటి ‘కార్తికేయ 2’. గతంలో చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ చేసిన ‘కార్తికేయ’ చిత్రానికిది సీక్వెల్. ‘కార్తికేయ’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. అందుకే ఈ సీక్వెల్ మీద మంచి హైప్ ఉంది. ఇది వరకే మొదలుకావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈలోపు నిఖిల్ ’18 పేజెస్’ చిత్రానికి కమిటయ్యారు.
దాంతో మరింత ఆలస్యమైంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాను రీస్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం చివరి దశలో ఉండటంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఈ నెలలో లేదా వచ్చే నెల ఆరంభంలో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కార్తికేయ’ తరహాలోనే ఇది కూడ సూపర్ నాచ్యురల్ థ్రిల్లర్.
