నిఖిల్-స్వాతిల ‘కార్తికేయ’ ఆడియో రిలీజ్ డేట్

karthikeya
యువకధానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా, ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందిస్తున్న’కార్తికేయ’ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో నిర్మిస్తున్నాం. తొలిచిత్రమే ద్వి భాషా చిత్రంగా రూపొందించటం ఎంతో ఆనందంగా ఉందని’ నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు.

ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్ తో కూడిన వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియోని ఈ నెల 27 న విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. ఈ మూవీలో హీరో హీరోయిన్ వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారు.

Exit mobile version