సెన్సార్ పూర్తి చేసుకున్న ‘స్వామి రారా’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘స్వామి రారా’

Published on Mar 19, 2013 4:45 PM IST

Swami-Ra-Ra
యంగ్ హీరో నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్స్ గా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘స్వామి రారా’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘సెన్సార్ వారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాలోని డైలాగ్స్ లో ఎలాంటి కట్స్ లేవు, ఒక్క పాటలో మాత్రం చిన్న లిరిక్ కట్ ఇచ్చారు. అలాగే ఓ మంచి మూవీ తీసారని సెన్సార్ వారు మెచ్చుకున్నారని’ హీరో నిఖిల్ తెలియజేసాడు. నిఖిల్ దొంగగా కనిపించనున్న ఈ సినిమాకి సుదీర్ వర్మ డైరెక్టర్.

లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపతి నిర్మించారు. సన్నీ అందించిన ఈ మూవీ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఈ నెల 23న(అనగా ఈ శనివారం) ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తి కరమైన పోస్టర్స్ డిజైనింగ్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకి నారా రోహిత్ వాయిస్ ఓవర్ అందించడం ఈ సినిమాకి మరో ఆకర్షణ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు