త్వరలోనే మొదలెట్టనున్న ‘కార్తికేయ – 2 ‘ !

Published on May 31, 2019 5:45 pm IST

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ పేరుతో రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..’దర్శకునిగా నా తొలి చిత్రం నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ మంచి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్ లో రూపొందనున్న ‘కార్తికేయ – 2 ‘ కూడా మంచి విజయం సాధిస్తోందనుకుంటున్నాను అని అన్నారు.

‘కార్తికేయ – 2 ‘ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చిత్రంలోని ఇతర నటీ నటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత,దర్శకులు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More