యూత్ ని ఆకట్టుకొనేలా ‘నిశ్శబ్ధం’ నిన్నే నిన్నే సాంగ్

యూత్ ని ఆకట్టుకొనేలా ‘నిశ్శబ్ధం’ నిన్నే నిన్నే సాంగ్

Published on Dec 22, 2019 7:00 AM IST

nishabdham 1

స్వీటీ అనుష్క మరో మారు నిశ్శబ్ధం చిత్రంతో భయపెట్టడానికి సిద్ధమయ్యారు. గత ఏడాది భాగమతిగా ఓ రేంజ్ లో వణుకు పుట్టించిన అనుష్క దాదాపు రెండేళ్ల తరువాత నిశ్శబ్ధం అనే మరో హారర్ థ్రిల్లర్ తో వస్తున్నారు. మాధవన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క మూగదైన పెయింటింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అమెరికా లోని సియాటిల్ ప్రాంతంలో జరిగిన క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మూవీ దాదాపు అమెరికాలో చిత్రీకరించారు.

ఈనెల 20న నిశ్శబ్ధం మూవీ నుండి ‘నిన్నే నిన్నే..’ అనే ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ విడుదలైంది. అనుష్క మరియు మాధవన్ మధ్య వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్ ని స్టార్ సింగర్ సిధ్ శ్రీరామ్ హార్ట్ టచ్చింగ్ గా పాడారు. భాస్కర భట్ల సాహిత్యానికి గోపి సుందర్ స్వరాలు చక్కగా కుదిరాయి. ఇప్పటికే యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధించిన ఈ సాంగ్ యూత్ కి బాగా చేరువైంది. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్నారు. అంజ‌లి, మైఖేల్ మ్యాడిస‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు