“నిశ్శబ్దం” ఇలా అస్సలు అందుబాటులో లేదా.?

“నిశ్శబ్దం” ఇలా అస్సలు అందుబాటులో లేదా.?

Published on Oct 1, 2020 4:00 PM IST

మన దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మెయిన్ లీడ్ లో మాధవన్, షాలిని పాండే, అంజలి తదితర నటులు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం “నిశ్శబ్దం”. ఈ చిత్రం ఇపుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. అనుష్క నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం కోసం చాలా మందే ఎదురు చూసారు.

థియేట్రికల్ రిలీజ్ కే చాలా కాలం వరకు దర్శక నిర్మాతలు స్టిక్ అయ్యి ఉన్నా తర్వాత మాత్రం డిజిటల్ రిలీజ్ కు అంగీకరించారు. దీనితో ఈ చిత్రం మొదటిగా ఓటిటిలోనే విడుదల కావడం ఖరారు అయ్యింది. అయితే ఇపుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న షాకింగ్ టాక్ ఏమిటంటే ఈ చిత్రం కేవలం అమెజాన్ ప్రైమ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది అని తెలుస్తుంది.

అంటే టెలివిజన్ లో తర్వాత కూడా రాదని టాక్. అందుకే ఈ చిత్రం కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే చూడడం కుదురుతుంది. మరి ఈ అంశంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం ఈరోజు రాత్రి 10:30 కు లేదా అర్ధ రాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ద్వారా అందుబాటులో ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు