’అ..ఆ’ ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్..!

A..Aa_
నితిన్, సమంత జంటగా మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ’అ..ఆ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మే 2న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక హైద్రాబాద్‌లో వైభవంగా జరగనుంది. ఇప్పుడు ఈ ఆడియో ఆవిష్కరణ వేడుక గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. అదేమిటంటే… ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని హీరో నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన విషయం తెలిసిందే. గతంలో కూడా నితిన్ కోరిక మేరకు ’ఇష్క్’ సినిమా ఆడియో లాంచ్ కు పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా మే 27వ తేదీ విడుదల అవుతున్నది.

Exit mobile version