
నితిన్, కరుణాకరణ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగిసింది ఇప్పటివరకూ తెరకెక్కిన సినిమా షూట్ పై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసారు. ఈ సినిమా షూటింగ్ 8 – 9 రోజుల క్రితం మొదలైంది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది
సుభాష్ ఘాయ్ పరిచయం చేసిన మిస్తీ చక్రవర్తి అనే నాయిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ భామకి ఇదే మొదటి తెలుగు సినిమా. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు
ఈ సినిమా నితిన్ సొంత బ్యానర్ లో నిర్మాణమవుతుంది. ఈ ప్రాజెక్ట్ పై నితిన్ చాలా నమ్మకంగా వున్నాడు

