నితిన్ ఇంట్రెస్టింగ్ సినిమా ఓటిటి లోనేనా.?

nithin
యూత్ స్టార్ నితిన్ హీరోగా చేస్తున్న పలు ఆసక్తికర సబ్జెక్టులలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ప్లాన్ చేసిన లేటెస్ట్ చిత్రం “మాస్ట్రో” కూడా ఒకటి. బాలీవుడ్ లో భారీ హిట్ గా నిలిచిన “అంధధూన్” కు రీమేక్ గా ప్లాంక్ చేసిన ఈ చిత్రం నుంచి ఆ మధ్య వచ్చిన పోస్టర్స్ కానీ గ్లింప్స్ కానీ మరింత ఆసక్తిని రేపాయి. అయితే ఈ చిత్రంలో ఇంకా జస్ట్ వారం రోజుల మేర మాత్రమే షూట్ జరుపుకున్న ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటిలో విడుదల అవుతుంది అని నయా గాసిప్ మొదలయ్యింది.

అయితే ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఈ నయా టాక్ వైరల్ అవుతుంది. ఎలాగో కరోనా ప్రభావం తగ్గుతుంది మరి అందాకా ఆగి డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ నే చేస్తారా లేక అసలు ఈ టాక్ నిజమేనా కాదా అన్నది తెలియాలి అంటే నిర్మాతలు నుంచి ఒక క్లారిటీ రావాల్సిందే. ఇక ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version