నిశ్చితార్థానికి రెడీ అయిన నితిన్

నిశ్చితార్థానికి రెడీ అయిన నితిన్

Published on Feb 14, 2020 10:31 PM IST

హీరో నితిన్ పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన షాలిని కందుకూరి అనే అమ్మాయిని పెళ్లాడనున్నాడు నితిన్. కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్న నితిన్, షాలినిలు పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడంతో ఏప్రిల్ 16న వివాహం జరగనుంది. అది కూడా దుబాయ్ లో కావడం విశేషం. పెళ్లి ఎలాగూ విదేశాల్లోనే కావడంతో నిశ్చితార్థం హైదరాబాద్లోని నివాసంలో చేసుకోవాలని నిర్ణయించారు.

ఈ వేడుక రేపే జరగనుంది. ఇరు కుటుంబాల సన్నిహితులు, పెద్దలు హాజరుకానున్నారు. ఇకపోతే నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది. ఇది పూర్తికాగానే వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దే’ చిత్రం స్టార్ట్ చేయనున్నారు. ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంళో ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు నితిన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు