లేటెస్ట్ : వెంకీ కుడుముల మూవీలో హీరోయిన్ రీప్లేస్మెంట్ పై నితిన్ క్లారిటీ

లేటెస్ట్ : వెంకీ కుడుముల మూవీలో హీరోయిన్ రీప్లేస్మెంట్ పై నితిన్ క్లారిటీ

Published on Nov 29, 2023 2:26 AM IST


నితిన్ హీరోగా ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 8న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో నితిన్ మరోవైపు వెంకీ కుడుముల తో తాను చేస్తున్న మూవీ గురించి పలు విషయాలు వెల్లడించారు. గతంలో తామిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మని మించేలా వెంకీ విభిన్న కాన్సెప్ట్ తో దీనిని తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలానే ఈ మూవీలో మొదట రష్మిక మందన్న ని ఎంపిక చేసింది యూనిట్.

అయితే డేట్స్ సమస్యల కారణంగా రష్మిక ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక ఈ విషయమై నితిన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉంది. నటీమణులు బాలీవుడ్ సినిమాల్లో భాగమయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. శ్రీలీల తమ సినిమాలోని హీరోయిన్ సరిగ్గా సరిపోతుందని నా దర్శకుడు వెంకీ అభిప్రాయపడ్డారు. శ్రీలీలతో మరోసారి కలిసి పనిచేయడం చాలా బాగుంది. ఆమె తెలుగు అమ్మాయి మరొక ప్లస్ పాయింట్ అన్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, అటు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తో పాటు ఇటు వెంకీ కుడుములు మూవీలో కూడా ఆమె నితిన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు