డెస్టిని చుట్టూ తిరిగే కథలో నితిన్ !

కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ నటించిన సినిమా ‘ఛల్ మోహన్ రంగ’. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో డెస్టిని కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం. గతంలో ఈ కాన్సెప్ట్ తో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే తరహాలో ఈ సినిమా విజయం సాధిస్తుందేమో చూడాలి.

మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ‘ఛల్ మోహన్ రంగ’ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తరువాత నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాతో పాటు ‘ఛలో’ డైరెక్టర్ వెంకి కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

Exit mobile version