ఆ విషయం సమంతనే అడగండి : నితిన్

nitin1
సౌత్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత, ప్రస్తుతం వరుస సినిమాలతో నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఇక ఇటు సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ఆమెను రోజూ వార్తల్లో కనిపించేలా చేస్తున్నాయి. తాజాగా తాను ఓ యువహీరోను ప్రేమిస్తున్నానని, తన ప్రేమ జీవితం చాలా బాగుందని చెప్పుకొచ్చిన సమంత, ఆ యువహీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. ఇక ఇదే విషయమై సమంత ఫ్రెండ్ మరియు ‘అ..ఆ..’లో సమంతకు జోడీగా నటించిన నితిన్‌ను అడగగా, ఆయన కూడా ఈ విషయం గురించి తనకూ పెద్దగా తెలియదని దాటవేశారు.

‘సమంత మీకు మంచి ఫ్రెండ్ కదా? తన లవ్ విషయం మీకు చెప్పే ఉంటారే?’ అని ‘అ..ఆ..’ ప్రమోషన్స్‌లో భాగంగా పెట్టిన ఓ ప్రెస్‌మీట్‌లో నితిన్‍కు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా ఆయన, “ఆ విషయం మీరు సమంతనే అడగాలి. అయినా సమంత లవ్ గురించి నేనేలా మాట్లాడగలనూ?” అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇక నితిన్, సమంత ఇద్దరూ జంటగా నటించిన ‘అ..ఆ..’ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version